logo

పాత్రికేయులపై వేధింపులు తగదు

సమాజ శ్రేయస్సు కోసం నిబద్ధతతో వార్తలు రాసే పాత్రికేయులపై వేధింపులకు పాల్పడడం సరైన విధానం కాదని పాత్రికేయుల ఐకాస కన్వీనర్ దేవేందర్ అన్నారు.

Published : 12 Jun 2024 14:02 IST

ఎదులాపురం: సమాజ శ్రేయస్సు కోసం నిబద్ధతతో వార్తలు రాసే పాత్రికేయులపై వేధింపులకు పాల్పడడం సరైన విధానం కాదని పాత్రికేయుల ఐకాస కన్వీనర్ దేవేందర్ అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ఎన్నికలపై ఓ ప్రముఖ ఛానెల్‌ స్టాఫ్‌ రిపోర్టర్‌ రాసిన కథనంపై ఒక పార్టీ నేతలు కేసు పెట్టి భయభ్రాంతులకు గురిచేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఫిర్యాదు చేసిన సదరు వ్యక్తి జర్నలిస్టులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పే వరకు కాంగ్రెస్ పార్టీ నల్లబ్యాడ్జీలు ధరించి వార్తలను కవర్ చేస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని