logo

Adilabad: చరవాణి పోయిందా.. పోలీసులను సంప్రదించండి

సెల్ఫోన్ పోయినా, చోరీకి గురైనా బాధితులు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం సూచించారు.

Published : 21 Jun 2024 17:26 IST

ఎదులాపురం: సెల్ఫోన్ పోయినా, చోరీకి గురైనా బాధితులు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం సూచించారు. వెంటనే సీఈఐఆర్ పోర్టల్ ద్వారా చరవాణి జాడ పోలీసులు తెలుసుకుంటారని తెలిపారు. గత మూడు నెలల్లో పోగొట్టుకున్న/దొంగిలించిన సెల్ ఫోన్లను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పది మంది బాధితులకు ఎస్పీ గౌష్ ఆలం అప్పగించారు. ఈ సందర్భంగా బాధితులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ చరవాణులు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. నేరస్తులు వాటిని దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయాన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కె.సురేందర్ రెడ్డి, సీఐలు కె.ఫణిధర్, శ్రీనివాస్, సైబర్‌క్రైమ్ సిబ్బంది సంజీవ్‌కుమార్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని