logo

ప్రజల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు

జిల్లాలో వరదలు సంభవించినప్పుడు ప్రజలను రక్షించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పాలనాధికారి బదావత్‌ సంతోష్, రామగుండం సీపీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

Updated : 13 Jun 2024 04:12 IST

ఎల్లంపల్లి జలాశయం వరదలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడుతున్న రెస్క్యూ టీం సభ్యులు

హాజీపూర్, న్యూస్‌టుడే: జిల్లాలో వరదలు సంభవించినప్పుడు ప్రజలను రక్షించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పాలనాధికారి బదావత్‌ సంతోష్, రామగుండం సీపీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. బుధవారం హాజీపూర్‌ మండలం గుడిపేట సమీపంలోని ఎల్లంపల్లి జలాశయంలో ప్రమాదాల సమయంలో వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించే విధానంపై రెస్క్యూ టీం సభ్యులతో డెమో నిర్వహించారు. రామగుండం సీపీ శ్రీనివాస్‌తో కలిసి కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల్లో వరదలు వస్తే వాటిలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు 44 మంది ఫ్లడ్‌ రిస్క్యూ సభ్యులను నియమించినట్లు తెలిపారు. వీరి కోసం ప్రత్యేక శిక్షణ అందించినట్లు వివరించారు. గతేడాది జరిగిన ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. రామగుండం పోలీసు కమిషనర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రజా రక్షణకు 10 సీట్లతో పడవ, 10 లైఫ్‌బోయ్స్, 50సీ మాస్టర్‌ లైఫ్‌జాకెట్స్, 5 మెడికల్‌ స్ట్రెచర్స్, నాలుగు కటింగ్‌ యంత్రాలు అందుబాటులో ఉంచామన్నారు. డీసీపీ అశోక్‌కుమార్, ఏసీపీలు ప్రకాష్, రమేష్, ప్రతాప్, సీఐ అశోక్, హాజీపూర్‌ ఎస్‌ఐ సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.

ఎల్లంపల్లి జలాశయంలో సహాయక చర్యలను బైనాక్యులర్‌ ద్వారా పరిశీలిస్తున్న పాలనాధికారి సంతోష్, సీపీ శ్రీనివాస్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని