logo

నిత్య చైతన్యశీలికి అశ్రునివాళి

అక్షర యోధుడు.. నిత్యచైతన్యశీలి.. అందరికీ మార్గదర్శి రామోజీరావు.. ఆయన మార్గం అనుసరణీయం.. తనదీక్ష, దక్షతల ద్వారా సాధారణ స్థాయి నుంచి అసామాన్యుడిగా ఎదిగారు.

Published : 21 Jun 2024 02:19 IST

లక్షెట్టిపేట, మంచిర్యాల పట్టణం- న్యూస్‌టుడే: అక్షర యోధుడు.. నిత్యచైతన్యశీలి.. అందరికీ మార్గదర్శి రామోజీరావు.. ఆయన మార్గం అనుసరణీయం.. తనదీక్ష, దక్షతల ద్వారా సాధారణ స్థాయి నుంచి అసామాన్యుడిగా ఎదిగారు. గురువారం రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సంస్మరణసభ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని ఇటిక్యాలలో ‘ఈనాడు’ యూనిట్‌ కార్యాలయంలో నిర్వహించారు. రామోజీరావు ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ప్రతినబూనారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కంట్రిబ్యూటర్లు, సిబ్బంది ఆయన చిత్ర పటానికి నివాళులర్పించారు. ఆయన జీవిత చరిత్ర డాక్యుమెంటరీని ప్రదర్శించారు. కార్యక్రమంలో యూనిట్‌ మేనేజర్‌ దొనపాటి దామోదర్‌రెడ్డి, రామోజీ గ్రూప్‌ సంస్థల సిబ్బంది పాల్గొన్నారు. 
ఆదిలాబాద్‌ సాంస్కృతికం: ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని మార్గదర్శి చిట్‌ఫండ్‌ కార్యాలయంలో సిబ్బంది అక్షర యోధుడు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మేనేజర్‌ ఎం.ప్రవీణ్‌కుమార్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

ఇటిక్యాలలో రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సిబ్బంది 


ఆదిలాబాద్‌ : నివాళులర్పిస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్‌ మేనేజర్, సిబ్బంది 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని