logo

యువకుడిపై పోక్సో, అట్రాసిటీ కేసు

ప్రేమ పేరుతో మాయమాటలు చెబుతూ ఏడాది పాటు బాలిక(17)ను తన వెంట తిప్పుకొని మోసం చేసిన యువకుడిపై మావల పోలీసు స్టేషన్‌లో పోక్సో కేసుతో పాటు అట్రాసిటీ కేసు గురువారం నమోదైంది.

Published : 21 Jun 2024 03:01 IST

ఆదిలాబాద్‌ నేర విభాగం, న్యూస్‌టుడే : ప్రేమ పేరుతో మాయమాటలు చెబుతూ ఏడాది పాటు బాలిక(17)ను తన వెంట తిప్పుకొని మోసం చేసిన యువకుడిపై మావల పోలీసు స్టేషన్‌లో పోక్సో కేసుతో పాటు అట్రాసిటీ కేసు గురువారం నమోదైంది. పట్టణంలోని ఒక కాలనీకి చెందిన యువకుడు(20) మావల పోలీసు స్టేషన్‌ పరిధిలోని కాలనీకి చెందిన బాలికకు మాయమాటలు చెప్పి ఏడాది పాటు తన వెంట తిప్పుకున్నాడు. అనంతరం ఇటీవల అతడు మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయమై ఆ బాలిక అతడిని ప్రశ్నించగా ఆమెను రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. మనస్తాపానికి గురైన ఆ బాలిక ఈ నెల 17న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అపహరణ కేసు నమోదు చేశారు. అనంతరం బాలిక ఆచూకీ తెలుసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించి వివరాలు సేకరించగా అసలు విషయం బయటపడిందని డీఎస్పీ జీవన్‌రెడ్డి తెలిపారు. బాలిక వాంగ్మూలం నమోదు చేసిన అనంతరం నిందితుడిపై పోక్సో కేసుతో పాటు అట్రాసిటీ కేసును నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని