logo

మానవత్వం మరిచిన కుమారులు

నవమాసాలు మోసి కనిపెంచిన కన్న తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు కుమారులు ముందుకు రాని సంఘటన గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రిలో చోటు చేసుకుంది.

Updated : 21 Jun 2024 04:33 IST

తల్లి మృతదేహం ఇంటికి తీసుకెళ్లేందుకు ఇష్టపడని వైనం 
కాలనీవాసుల జోక్యంతో అంత్యక్రియల నిర్వహణ  

మల్లక్క  

మందమర్రి పట్టణం, న్యూస్‌టుడే: నవమాసాలు మోసి కనిపెంచిన కన్న తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు కుమారులు ముందుకు రాని సంఘటన గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రిలో చోటు చేసుకుంది. కాలనీవాసుల జోక్యంతో చిన్న కొడుకు అంత్యక్రియలు జరిపించారు. కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మందమర్రి పట్టణంలోని విద్యానగర్‌లో రాగంశెట్టి మల్లక్క(60)-మల్లేశ్‌ దంపతులకు నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు కొడుకులు, కూతురు సంతానం. సింగరేణి విశ్రాంత కార్మికుడైన మల్లేశ్‌ నాలుగేళ్ల క్రితం మరణించారు. తల్లి మల్లక్కను కొన్ని రోజులు బాగానే చూసుకున్న కుమారులు తరువాత పట్టించుకోలేదని కాలనీవాసులు తెలిపారు. దీంతో అదేకాలనీలోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటోంది. గురువారం తెల్లవారుజామున మల్లక్క అనారోగ్యంతో మరణించింది. ఈ విషయాన్ని ఇంటి యజమాని కొట్టే కొమురయ్య కుమారులు తిరుపతి, వెంకటేష్, సురేష్‌లకు సమాచారం ఇవ్వడంతో వచ్చారు. కానీ తల్లి మృతదేహాన్ని తమ ఇంటికి తీసుకెళ్లేందుకు ఇష్టపడలేదు. దీంతో కాలనీవాసులు జోక్యం చేసుకున్నారు. వారితో మాట్లాడారు. ఓ దశలో కాలనీవాసులే చందాలు వేసుకుని అంత్యక్రియలు జరిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అతికష్టమ్మీద చిన్న కుమారుడు అంత్యక్రియలు పూర్తి చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని