logo

నలుగురు హెడ్‌కానిస్టేబుళ్లపై వేటు

మల్టీజోన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని నలుగురు హెడ్‌కానిస్టేబుళ్లపై ఆదిలాబాద్‌ ఎస్పీ గౌష్‌ ఆలం సస్పెన్షన్‌ వేటు వేశారు.

Updated : 22 Jun 2024 06:07 IST

ఆదిలాబాద్‌ నేర విభాగం, న్యూస్‌టుడే : మల్టీజోన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని నలుగురు హెడ్‌కానిస్టేబుళ్లపై ఆదిలాబాద్‌ ఎస్పీ గౌష్‌ ఆలం సస్పెన్షన్‌ వేటు వేశారు. స్పెషల్‌ బ్రాంచీలో పని చేస్తున్న ముగ్గురు హెడ్‌కానిస్టేబుళ్లు విధులు సక్రమంగా నిర్వహించకపోవటం, పాస్‌పోర్టు జారీ విషయంలో విచారణలో సంపూర్ణ వివరాలను సమర్పించకపోవటాన్ని తప్పు పడుతూ విధుల నుంచి తప్పించినట్లు సమాచారం. సస్పెండ్‌ అయిన వారిలో కోటేశ్‌, వెంకటస్వామి, హిరామన్‌ ఉన్నారు. స్థల వివాదంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించటంతో పాటు పురపాలక అధికారుల విధుల్లో ఆటంకం కలిగించారని మురాద్‌ అనే హెడ్‌కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా సక్రమంగా విధులు నిర్వహించని స్పెషల్‌ బ్రాంచీలో పని చేస్తున్న ముగ్గురు హెచ్‌సీలను వారి విధుల నుంచి తప్పించి సంబంధిత పీఎస్‌లకు అటాచ్డ్‌ చేశారు. ఒక ఏఎస్‌ఐ, మరో హెడ్‌కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్‌కు డీఎస్‌బీ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ గౌష్‌ ఆలంను సంప్రదించగా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని క్రమ శిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్‌ చేసినట్లు ధ్రువీకరించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని