logo

వీఆర్‌ఏ కూతురుకు డాక్టరేట్‌

మండలంలోని గొడిసిర్యాల గ్రామానికి చెందిన రత్నాల సుధారాణి శుక్రవారం పీˆహెచ్‌డీ పట్టా పొందారు. నిరుపేద కుటుంబానికి చెందిన రత్నాల పోశం గ్రామంలో వీఆర్‌ఏగా విధులు నిర్వహిస్తూ తనకున్న సంతానం నలుగురిని ఉన్నత చదువులు చదివించారు.

Updated : 22 Jun 2024 06:06 IST

పీహెచ్‌డీ పట్టా అందుకుంటున్న సుధారాణి

దస్తూరాబాద్, న్యూస్‌టుడే: మండలంలోని గొడిసిర్యాల గ్రామానికి చెందిన రత్నాల సుధారాణి శుక్రవారం పీహెచ్‌డీ పట్టా పొందారు. నిరుపేద కుటుంబానికి చెందిన రత్నాల పోశం గ్రామంలో వీఆర్‌ఏగా విధులు నిర్వహిస్తూ తనకున్న సంతానం నలుగురిని ఉన్నత చదువులు చదివించారు. సుధారాణి సంగారెడ్డిలోని ఎన్‌టీఆర్‌ వ్యవసాయ ఇంజినీరింగ్‌ కళాశాలలో పీహెచ్‌డీ చేశారు. మట్టి లేకుండా నీళ్లలో మొక్కలను పెంచే అంశంపై పరిశోధన చేసి ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం నుంచి డైరెక్టర్‌ జనరల్‌ డా.హిమాన్స్‌పటక్, వైస్‌ ఛాన్స్‌లర్‌ డా.శారద జయలక్ష్మిదేవి చేతుల మీదుగా పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం ఆమె కరీంనగర్‌లోని ఎం.జె.పి.టి.బి.సి.డబ్ల్యూ.ఆర్‌.ఈ.ఐ.ఎస్‌.లో అసిస్టెంట్ ప్రొఫసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని