logo

చిరుత సంచారంతో భయాందోళన

తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం కుచులాపూర్‌ అటవీప్రాంతంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది.

Published : 22 Jun 2024 02:49 IST

కుచులాపూర్‌ అటవీ ప్రాంతంలో ట్రాప్‌ కెమెరాలో కనిపించిన చిరుత 

తలమడుగు, న్యూస్‌టుడే : తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం కుచులాపూర్‌ అటవీప్రాంతంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాల్లో చిరుతపులి కనిపించడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. రెండు రోజుల కిందట అదే గ్రామానికి చెందిన కల్యాణం ఆశన్న అనే రైతుకు చెందిన ఎద్దు పశుగ్రాసం కోసం అటవీకి వెళ్లగా హతమార్చింది. వ్యవసాయ పనులు ముమ్మరంగా జరిగే సమయంలో చిరుతల సంచారంతో గ్రామస్థులు వ్యవసాయ పనులు మానేసి ఇంటి వద్దనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. పశువులను మేత కోసం తీసుకెళ్లకుండా ఇంటి వద్దనే ఉంచుతున్నారు. రైతులు, కూలీలు పనుల కోసం అటువైపు వెళ్లకుండా అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. బేస్‌ క్యాంపులను సైతం ఏర్పాటు చేసినట్లు అటవీశాఖ రేంజ్‌ అధికారి రణవీర్‌ తెలిపారు. ప్రజలను అప్రమత్తం చేశామన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని