logo

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం భోరజ్‌ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. 108 సిబ్బంది వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌ నుంచి మహారాష్ట్రలోని వణికి శుక్రవారం ఆర్టీసీ బస్సులో ప్రయాణికులను ఎక్కించుకొని డ్రైవర్‌ సిడాం అర్జున్‌ వెళుతున్నాడు.

Published : 22 Jun 2024 02:50 IST

తప్పిన పెను ప్రమాదం

డ్రైవర్‌ అర్జున్‌కు ప్రథమ చికిత్స అందిస్తున్న 108 సిబ్బంది 

జైనథ్, న్యూస్‌టుడే : ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం భోరజ్‌ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. 108 సిబ్బంది వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌ నుంచి మహారాష్ట్రలోని వణికి శుక్రవారం ఆర్టీసీ బస్సులో ప్రయాణికులను ఎక్కించుకొని డ్రైవర్‌ సిడాం అర్జున్‌ వెళుతున్నాడు. జైనథ్‌ మండలం భోరజ్‌ సమీపంలో హఠాత్తుగా డ్రైవర్‌కు గుండెనొప్పి వచ్చింది. చాకచక్యంతో డ్రైవర్‌ అర్జున్‌ బస్సును పక్కన నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు 108కు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఈఆర్‌సీపీ డా.మనీష్, ఈఎంటీ కార్తిక్, పైలెట్‌ సాయికిరణ్‌లు ఆయనకు ప్రథమ చికిత్స అందించి ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వారు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని