logo

తీరు మారని అధికారులు

జిల్లా కేంద్రంలో శుక్రవారం జడ్పీ ఛైర్మన్‌ జనార్దన్‌ రాఠోడ్‌ అధ్యక్షతన, కలెక్టర్‌ రాజార్షి షా నేతృత్వంలో సాగిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి చాలామంది అధికారులు హాజరుకాలేదు.

Published : 22 Jun 2024 02:55 IST

ఈటీవీ - ఆదిలాబాద్‌ : జిల్లా కేంద్రంలో శుక్రవారం జడ్పీ ఛైర్మన్‌ జనార్దన్‌ రాఠోడ్‌ అధ్యక్షతన, కలెక్టర్‌ రాజార్షి షా నేతృత్వంలో సాగిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి చాలామంది అధికారులు హాజరుకాలేదు. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్‌ ఎస్‌ఈలు హాజరుకాలేదు. జడ్పీ హాజరు రికార్డు ఆధారంగా ఉపాధి కల్పనాధికారి, వైద్యారోగ్యశాఖ ఉట్నూరు అదనపు డీఎంహెచ్‌వో, ఆర్టీసీ ఆర్‌ఎం, జిల్లా రవాణా శాఖాధికారి(ఆర్టీవో), జిల్లా ఖజానాధికారి, నెడ్‌క్యాప్‌ మేనేజర్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి, డీసీఎంఎస్‌ మేనేజర్, డీసీసీబీ సీఈవో, మత్స్య శాఖాధికారి, ఉద్యాన శాఖాధికారి హాజరుకాలేదు. ఒకటి రెండు శాఖల తరఫున ప్రతినిధులు హాజరుకావటంతో ఎమ్మెల్యేలు, ఎంపీ, జడ్పీటీసీ సభ్యులు అడిగిన వివిధ అనుమానాలకు సరైన సమాధానాలు రాలేదు. ‘‘రూ.కోట్ల వ్యయంతో రహదారులు, వంతెనలు, వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న భవనాల నిర్మాణాలపై పనుల ప్రగతి నివేదికలు  ఏవని సభ్యులు ప్రశ్నించగా పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ ఈఈలు శివరాం, నర్సయ్య సరైన సమాధానం చెప్పలేక తడబడటంతో కలెక్టర్‌ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అటవీశాఖ తరఫున ఇవ్వాల్సిన నోట్‌ సభ్యులకు ఇచ్చిన అజెండాలో జతపర్చకపోవటం స్వయంగా ఎంపీ గోడం నగేష్‌ తప్పుపట్టగా అప్పటికప్పుడు ఆ శాఖ తరఫున సభ్యులకు ప్రతులను పంపిణీ చేయటం చర్చనీయాంశమైంది.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని