logo

పోలీస్‌బాస్‌ తొలుత నిర్మల్‌ ఏఎస్పీ

నిర్మల్‌ సహాయక ఎస్పీగా తొలి పోస్టింగ్‌ చేపట్టిన జితేందర్‌ రాష్ట్ర డీజీపీగా నియమితులయ్యారు. ఆయన ఇక్కడ ఏఎస్పీగా 6 జనవరి 1995 నుంచి 12 డిసెంబరు 1995 వరకు పనిచేశారు

Updated : 11 Jul 2024 06:46 IST

1995లో నిర్మల్‌లో తమ పెళ్లి రిసెప్షన్‌లో జితేందర్‌ దంపతులు  

నిర్మల్, న్యూస్‌టుడే: నిర్మల్‌ సహాయక ఎస్పీగా తొలి పోస్టింగ్‌ చేపట్టిన జితేందర్‌ రాష్ట్ర డీజీపీగా నియమితులయ్యారు. ఆయన ఇక్కడ ఏఎస్పీగా 6 జనవరి 1995 నుంచి 12 డిసెంబరు 1995 వరకు పనిచేశారు. ఆ తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. నిర్మల్‌ ఏఎస్పీగా ఉన్న సమయంలో ఆయన వివాహం జరిగింది. ఏడాదిపాటు పనిచేసిన ఆయన శాంతిభద్రతల పరిరక్షణకు ఎంతో కృషి చేసినట్లు అప్పట్లో ఆయనతో కలిసి విధులు నిర్వర్తించిన పోలీసులు వెల్లడించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని