logo

యోగా సాధనతో మానసిక ప్రశాంతత

జీవితంలో యోగా ఎంతో అవసరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు పేర్కొన్నారు.

Published : 21 Jun 2024 13:01 IST

ఎదులాపురం: జీవితంలో యోగా ఎంతో అవసరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు పేర్కొన్నారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాలు, పోలీసు కార్యాలయాల్లో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో యోగా కార్యక్రమాల్లో ప్రధాన న్యాయమూర్తి తో పాటు ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం, డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎన్ చంద్రశేఖర్, పట్టణ పోలీసులు, రిజర్వ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని