logo

విద్యుత్తు సమస్యల పరిష్కారానికి ప్రజావాణి

విద్యుత్తు వినియోగదారుల పరిష్కారమే లక్ష్యంగా టీఎస్ ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని...

Published : 12 Jun 2024 12:35 IST

నిర్మల్ అర్బన్ : విద్యుత్తు వినియోగదారుల పరిష్కారమే లక్ష్యంగా టీఎస్ ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆ శాఖ ఎస్ఈ  బి. శ్రీనివాస్ అన్నారు. బుధవారం నిర్మల్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పలువురు నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వీటిని త్వరితగతిన పరిష్కరించనున్నామని చెప్పారు. జిల్లాలో నాణ్యమైన నిరంతర విద్యుత్తు సరఫరా కోసం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో విద్యుత్తు శాఖ టెక్నికల్ డీఈ శ్రీనివాసరావు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సుదర్శన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని