logo

Adilabad: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని అదిలాబాద్ జిల్లా అదనపు పాలనాధికారి  శ్యామలదేవి పేర్కొన్నారు.

Published : 12 Jun 2024 15:24 IST

తాంసి: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని అదిలాబాద్ జిల్లా అదనపు పాలనాధికారి  శ్యామలదేవి పేర్కొన్నారు. బుధవారం తాంసి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్య, నోటు పుస్తకాలను అందజేశారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లల చదువుపై తగిన శ్రద్ధ చూపాలన్నారు. అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మౌలిక వసతుల పనులను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీకాంత్, ఎంపీడీవో మోహన్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు