logo

వేతనాలు చెల్లించాలని వినతి

స్టాఫ్ నర్సులుగా విధులు నిర్వహిస్తున్న తమకు వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆదిలాబాద్ రిమ్స్ స్టాఫ్ నర్స్ లు పేర్కొన్నారు.

Published : 21 Jun 2024 13:13 IST

ఎదులాపురం: స్టాఫ్ నర్సులుగా విధులు నిర్వహిస్తున్న తమకు వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆదిలాబాద్ రిమ్స్ స్టాఫ్ నర్స్ లు పేర్కొన్నారు. ఈ విషయంపై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా  వారు మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో విధుల్లో చేరినప్పటికీ ఇప్పటివరకు వేతనాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. అనంతరం  రిమ్స్ డైరెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని