logo

Adilabad: సమస్యల పరిష్కారమే లక్ష్యం

కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఐటీయూ పోరాడుతుందని ఆ యూనియన్ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు.

Published : 21 Jun 2024 15:04 IST

ఎదులాపురం: కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఐటీయూ పోరాడుతుందని ఆ యూనియన్ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్‌లోని సుందరయ్య భవన్‌లో సీఐటీయూ జిల్లా కార్యాలయ నిర్మాణ వర్క్ షాప్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. భవన నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యల పరిష్కారాన్ని తీసుకోవాల్సిన కార్యాచరణ పై చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని