logo

రాములోరి కల్యాణానికి ఆలయాల ముస్తాబు

జిల్లావ్యాప్తంగా గురువారం శ్రీరామనవమి వేడుకలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. జీకేవీధిలో సీతారామ కల్యాణ మహోత్సవానికి బుధవారం ముహూర్తపు రాట వేశారు.  

Published : 30 Mar 2023 03:10 IST

జీకేవీధిలో పెళ్లిరాట వేస్తున్న భక్తులు

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా గురువారం శ్రీరామనవమి వేడుకలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. జీకేవీధిలో సీతారామ కల్యాణ మహోత్సవానికి బుధవారం ముహూర్తపు రాట వేశారు.  

కొయ్యూరు, న్యూస్‌టుడే: కాకరపాడులో తీర్థం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఐదురోజులపాటు తీర్థం నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: చింతపల్లి రామాలయం వద్ద సీతారాముల కల్యాణానికి బుధవారం పెళ్లి రాట వేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. మాదాబత్తుల సత్యనారాయణ, వినాయకరావు, రమణమూర్తి పాల్గొన్నారు.

సీలేరు: సీలేరు, ధారకొండ, దుప్పిలవాడ, కాట్రగెడ్డ, వలసగెడ్డ రామాలయాలను సుందరంగా అలంకరించారు. విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు.

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: భద్రాచలం రామాలయం వెళ్లే భక్తులతో మారేడుమిల్లిలో సందడి వాతావరణం నెలకొంది. మారేడుమిల్లిలో ఆగి అల్పాహారం, భోజనాలు చేయడంతో ప్రధాన కూడళ్లలో రద్దీ ఏర్పడింది. రాజమహేంద్రవరం, గోకవరం, కాకినాడ, రాజోలు తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు మారేడుమిల్లి మీదుగా నడిచాయి.  

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: రాజవొమ్మంగి, బడదనాంపల్లి, సూరంపాలెం, శాంతినగర్‌, శరభవరం, సీతారామపురం, జడ్డంగి, వట్టిగెడ్డ, దూసరపాము తదితర గ్రామాల్లోని రామాలయాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయాల వద్ద చలువ పందిళ్లు వేశారు.

మోతుగూడెం, న్యూస్‌టుడే: మోతుగూడెంలోని జానకీ కోదండ రామాలయంలో బుధవారం ఉదయం ధ్వజారోహణం, సాయంకాలం భేరి పూజ, రాత్రి ఎదురు సన్నాహం తదితర పూజలు అర్చకస్వామి పవన్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని