logo

136 మందికి ఏకలవ్యలో ప్రవేశాలు

పాడేరు ఐటీడీఏ పరిధిలోని ఏకలవ్య కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ 136 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించినట్లు ఐటీడీఏ పీవో అభిషేక్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 13 Jun 2024 02:41 IST

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: పాడేరు ఐటీడీఏ పరిధిలోని ఏకలవ్య కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ 136 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించినట్లు ఐటీడీఏ పీవో అభిషేక్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన సంక్షేమశాఖ డీడీ కొండలరావు, ప్రిన్సిపల్స్‌ రమణారావు, మూర్తి, పారయ్యల పర్యవేక్షణలో బుధవారం స్థానిక గిరిజన గురకుల కళాశాల ప్రాంగణంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఎంపికైనవారిలో 85 మంది బాలురు, 51 మంది బాలికలు ఉన్నారన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని