logo

విద్యాకానుక కిట్ల అందజేత

పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యా కానుక కిట్ల పంపిణీని అరకులోయలో బుధవారం ప్రారంభించారు.

Published : 13 Jun 2024 02:44 IST

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యా కానుక కిట్ల పంపిణీని అరకులోయలో బుధవారం ప్రారంభించారు. మండల విద్యాశాఖ అధికారులు టి.మోహనరావు, భారతీరత్నం చేతులమీదుగా ప్రధానోపాధ్యాయలకు అందజేశారు. మండలంలో 145 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పరిధిలో 10444 మంది విద్యార్థులుండగా వీరికి పాఠ్యపుస్తకాలు, ఏకరూపు దుస్తులు, 51,332 రాత పుస్తకాలు వచ్చాయి. 3,155 మీడియం సైజ్‌ బ్యాగులు వచ్చాయన్నారు. బెల్టులు, బూట్లు, పూర్తిస్థాయిలో బ్యాగులు రావాల్సి ఉందని ఎంఈఓ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని