logo

బలిమెల నిర్వహణపై సమీక్ష

బలిమెల జలాశయం నిర్వహణ, నీటి వాడకంపై ఆంధ్రా, ఒడిశా అధికారులు బుధవారం సీలేరు ఏపీ జెన్‌కో అతిథి గృహంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Published : 13 Jun 2024 02:45 IST

సీలేరు, న్యూస్‌టుడే: బలిమెల జలాశయం నిర్వహణ, నీటి వాడకంపై ఆంధ్రా, ఒడిశా అధికారులు బుధవారం సీలేరు ఏపీ జెన్‌కో అతిథి గృహంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం బలిమెల జలాశయంలో 13.94 టీఎంసీల నీరుండగా, జోలాపుట్‌లో 2.66 టీఎంసీలు నీరుందని, మొత్తం 16.61 టీఎంసీలు నీరుందని లెక్కగట్టారు. రాబోయే నెలలో సుమారు 1.30 టీఎంసీల వరకు నీటినిల్వలు రెండు జలాశయాల్లో చేరే అవకాశముందని అంచనా వేశారు. మొత్తం సుమారు 17.91 టీఎంసీల్లో ఒడిశా 10.97 టీఎంసీలు, ఏపీ జెన్‌కో 6.94 టీఎంసీలు వాడుకోవడానికి నిర్ణయించారు. మే నెలలో ఏపీ 2.51 టీఎంసీలు, ఒడిశా 6.17 టీఎంసీలు వాడుకున్నట్లు తేల్చారు. 2023-24లో ఏపీ 61.63 టీఎంసీలు నీటిని వినియోగించుకోగా, ఒడిశా 57.60 టీఎంసీలు వినియోగించుకున్నట్లు లెక్కలు తేల్చారు. బలిమెల జలాశయం నుంచి ఏపీ అదనంగా 4.03 టీఎంసీలు వాడుకుందని తెలిపారు. ప్రస్తుతానికి గ్రిడ్‌ డిమాండ్, విద్యుత్తు అవసరాల నిమిత్తం ఒడిశా 3300 క్యూసెక్కులు, ఏపీ 1500 క్యూసెక్కులు నీటిని బలిమెల జలాశయం నుంచి వాడుకోవడానికి నిర్ణయించారు. ఒడిశా జలవనరులశాఖ నుంచి పర్యవేక్షక ఇంజినీర్‌ రామకంఠ పాత్రో, ఏఈఈ తుషార్‌ రంజన్, ఏఈ గదాదర్‌ ప్రధాన్, ఒడిశా హైడ్రోపవర్‌ కార్పొరేషన్‌ తరఫున డిప్యూటీ జనరల్‌ మేనేజర్లు జ్యోతిర్మయి దాస్, డిప్యూటీ మేనేజర్‌ పి.ఉమేష్‌ పాత్రో, సీహెచ్‌ బెహరా, అసిస్టెంటు మేనేజర్‌ రాకేష్‌ పాణీగ్రహి, ఏపీ జెన్‌కో తరఫున ఎస్‌ఈ కేకేవీ ప్రశాంత్‌కుమార్, ఈఈ ప్రభాకర్, డీఈఈ వెంకట మధు, ఏఈఈ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని