logo

గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు: పీవో

వర్షాకాలంలో ఏజెన్సీలోని గ్రామాల్లో మలేరియా, డెంగీ తదితర వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు గ్రామాల్లో పర్యవేక్షించాలని పీవో సూరజ్‌ గనోరే సిబ్బందిని అదేశించారు.

Published : 13 Jun 2024 02:46 IST

రంపచోడవరం, న్యూస్‌టుడే: వర్షాకాలంలో ఏజెన్సీలోని గ్రామాల్లో మలేరియా, డెంగీ తదితర వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు గ్రామాల్లో పర్యవేక్షించాలని పీవో సూరజ్‌ గనోరే సిబ్బందిని అదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో బుధవారం వైద్యారోగ్యశాఖాధికారులు, ఎంపీడీవోలు, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ జ్వరాలతో ఆసుపత్రులకు వచ్చిన రోగులకు రక్త నమూనాలు సేకరించి, మలేరియా, డెంగీ నిర్థారణ అయితే వారిని ఆసుపత్రుల్లో చేర్చుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో మలేరియా దోమలు ప్రబలకుండా ఫాగింగ్‌ చేయాలని, ప్రతి ఇంటిలో మలేరియా దోమల నివారణ మందు పిచికారీ చేయించాలన్నారు. ప్రతి ఆశ్రమ, ప్రభుత్వ పాఠశాలల్లో దోమల నివారణ మందు పిచికారీ, ఫాగింగ్‌ తప్పనిసరి అని సూచించారు. ప్రతి రోజు ఒక్కొక్క పీహెచ్‌సీలో ఎన్ని రక్త పరీక్షలు చేస్తున్నది? వాటిలో ఎంతమందికి  మలేరియా వ్యాధి నిర్థారణ అవుతుంది తదితర పలు అంశాలపై ఆరా తీశారు. మలేరియా ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పీహెచ్‌సీలలో మలేరియా, డెంగీ వ్యాధికి సంబంధించిన మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఆశ్రమ, ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి శాంపిళ్లు సేకరించి నివేదికలు సమర్పించాలన్నారు. విద్యార్థులకు జ్వరం సోకితే వెంటనే సమీప ఆసుపత్రికి తీసుకొని వెళ్లి వైద్యం చేయించాలన్నారు. ఫాగింగ్‌ యంత్రాలు మరమ్మతులకు గురైతే బాగుచేయించాలన్నారు. కార్యక్రమంలో డివిజనల్‌ పంచాయతీ అధికారి రఘునందన్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ తేజస్విని, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ రాజేంద్రబాబు, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని