logo

బడిబాటకు సై!

ఈ దఫా బడి బాట పట్టేందుకు పిల్లలు అధికంగానే ముందుకు వచ్చారు. పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో పాఠశాలల్లో చేరేందుకు వందలాది మంది విద్యార్థులు సిద్ధమవుతున్నారు.

Published : 13 Jun 2024 02:49 IST

ముందుకొచ్చిన సాధారణ పిల్లలు సహా దివ్యాంగులు 
పాఠశాలల్లో చేరేందుకు సంసిద్ధత
న్యూస్‌టుడే, నర్సీపట్నం

ఈ దఫా బడి బాట పట్టేందుకు పిల్లలు అధికంగానే ముందుకు వచ్చారు. పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో పాఠశాలల్లో చేరేందుకు వందలాది మంది విద్యార్థులు సిద్ధమవుతున్నారు. ఇంటింటి సర్వేలతో వీరి గుర్తింపు పూర్తయింది. వీరిందరి నుంచి దరఖాస్తులు సేకరిస్తున్నారు. ముందుకు వచ్చిన సాధారణ పిల్లలు సహా దివ్యాంగులను స్కూళ్లు, హాస్టళ్లు, భవిత కేంద్రాల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  

టా పాఠశాలలు తెరవడానికి ముందు బడికి దూరంగా ఉంటున్న పిల్లలను గుర్తించే కార్యక్రమాలు చేపడుతుంటారు. ఈ ఏడాది వసతి గృహాల సంక్షేమాధికారులు, భవిత కేంద్రాల ప్రత్యేక ఉపాధ్యాయులు గత రెండు వారాలుగా ఇంటింటి సర్వేలు నిర్వహించారు. వీరి చొరవ ఫలితంగా ప్రస్తుతం ఎక్కువగానే బడుల్లో చేరడానికి విద్యార్థులు నమోదయ్యారు. చదువు వల్ల  ప్రయోజనాలు, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలును సర్వే సిబ్బంది తల్లిదండ్రులకు వివరించారు. సర్వే విజయవంతంగా పూర్తి కావడంతో ఇప్పుడు వారి నుంచి దరఖాస్తులు సేకరిస్తున్నారు. వసతిగృహాల సంక్షేమాధికారుల చొరవతో జిల్లాలో ఏకంగా వెయ్యి మందికి పైగానే పిల్లలు వసతి గృహాల్లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. భవిత కేంద్రాల ప్రత్యేక ఉపాధ్యాయుల కృషి ఫలితంగా ముందెన్నడూ లేని విధంగా 516 మంది బడి బాట పట్టేందుకు ముందు వచ్చారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇకపై పాఠశాలలు, హాస్టళ్ల పరిస్థితి మరింతగా మెరుగుపడుతుందని తల్లిదండ్రులు భావిస్తున్న ఫలితంగా సర్వేకు మంచి స్పందన లభించిందంటున్నారు.


నర్సీపట్నంలో 110 మంది

- శ్యామల, ఏఎస్‌డబ్ల్యూఓ, నర్సీపట్నం

నర్సీపట్నం సహాయ సాంఘిక సంక్షేమాధికారి (ఏఎస్‌డబ్ల్యూఓ) పరిధిలోని పది హాస్టల్లో చేపట్టిన సర్వే ఫలితంగా మొత్తం 110 మంది వసతిగృహాల్లో చేరేందుకు ముందుకు వచ్చారు. వీరి తల్లిదండ్రులకు హాస్టళ్లలలో చదువుల వల్ల సమకూరే ప్రయోజనాలను వార్డెన్లు వివరించారు. ఇవి పునఃప్రారంభం కానున్న మేరకు ముందుగానే గృహాలన్నింటిని శుభ్ర పర్చి పక్కాగా సిద్ధం చేశాం.


అందరినీ చేర్పించే బాధ్యత తీసుకుంటాం

- శకుంతల, జిల్లా సహితవిద్య సమన్వయకర్త  

జిల్లాల్లో ఇంటింటి సర్వేలో గుర్తించిన 516 మంది దివ్యాంగులను పాఠశాలలు, భవిత కేంద్రాల్లో చేర్పించే బాధ్యతను తీసుకుంటున్నాం. వీరందరి నుంచి ఇప్పుడు దరఖాస్తులు సేకరిస్తున్నాం. వీటిలో చేరే పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా అవసరమైన అన్ని ఉపకరణాలు, పలు సదుపాయాలను కల్పిస్తుంది. సర్వేలో గుర్తించిన వారిలో అన్ని రకాల వైకల్యాలు ఉన్న పిల్లలు ఉన్నారు. ఇంకా ఎవరైనా ఉంటే వారంతా సమీపంలోని భవిత కేంద్రాలో సంప్రదించి చేరవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని