logo

చంద్రన్న ప్రమాణం.. వీక్షించిన జనం

ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుతోపాటు, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రజలు, ప్రభుత్వ శాఖలు అధికారులు, సిబ్బంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.

Published : 13 Jun 2024 02:58 IST

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుతోపాటు, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రజలు, ప్రభుత్వ శాఖలు అధికారులు, సిబ్బంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. మారేడుమిల్లి మండలం పరిషత్తు కార్యాలయంలో ఎల్‌ఈడీ తెరను ఏర్పాటు చేశారు.  ఎంపీడీఓ వీరకిశోర్, పరిపాలనాధికారిణి పి.జయంతి, ఏబీపీ మనస్విని, ఈవోపీఆర్డీ విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. అంబేడ్కర్‌ విగ్రహానికి జిల్లా వాల్మీకి సంఘం కార్యదర్శి అక్కపల్లి పండు నివాళులు అర్పించారు.


ఎటపాక: స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిడీఓ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఎల్‌ఈడీ స్క్రీన్‌ ఏర్పాటు చేశారు. లక్ష్మీపురంలో తెదేపా ఎస్టీ సెల్‌ మండల అధ్యక్షులు కణితి మధు ఆధ్వర్యంలో ఏజెన్సీ ఆయుర్వేద వైద్యులు జమాల్‌ఖాన్‌ పలువురు  కూటమి నాయకుల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేశారు. సీతాపురంలో తెదేపా సీనియర్‌ నాయకులు పూరేటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తెదేపా దిమ్మెకు పూలు జల్లారు.  


కూనవరం, చింతూరు, న్యూస్‌టుడే: కూనవరం నుంచి కూటమి నాయకులు ప్రత్యేక బస్సులో అమరావతి వెళ్లారు. ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేకంగా బుల్లితెరపై ప్రమాణస్వీకారాన్ని అధికారులు, నాయకులు తిలకించారు. టేకులబోరులో జనసేన నాయకులు కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. తెదేపా మండల అధ్యక్షుడు బరపాటి ప్రకాశరావు,  సర్పంచులు, దాసరి నరేంద్ర, హేమంత్, బద్రి, భాజపా నాయకులు నరేశ్‌ పాల్గొన్నారు. చింతూరు ఐటీడీఏ  పాత ఆసుపత్రి ఆవరణలో ఎల్‌ఈడీ తెర ఏర్పాటు చేసింది.


 చింతపల్లి గ్రామీణం: చింతపల్లిలో జనసైనికులు బాణసంచా కాల్చారు. జన సైనికులు తాటిపాకలు రమేష్, దూనబోయిన రమణ, బేతాళుడు, హరి, శేఖర్, తరుణ్‌ పాల్గొన్నారు.   


చింతపల్లి/ గ్రామీణం: లంబసింగిలో తెదేపా మండల ఉపాధ్యక్షుడు కిముడు లక్ష్యయ్య, నాయకులు రామరాజుపడాల్, సోమలింగం, రాజారావు, భీమరాజు, బంగారయ్య, వెంకటరమణ, రాజేష్, లోవరాజు, బెన్నలింగేశ్వరరావు కేక్‌ కోశారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై దృష్టి సారిస్తాయన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉందని స్టూడెంట్‌ కొపోకాన్‌ కరాటే ముఖ్య శిక్షకుడు పాండురాజు బుధవారం పేర్కొన్నారు. 

చింతపల్లి వెలుగు కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు ఎంపీడీవో సాయిబాబు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఎంపీపీ అనూషాదేవి, ఎంఈవో ప్రసాద్, వెలుగు ఏపీవో నాయుడు, తెదేపా నాయకులు రీమల ఆనంద్, లక్ష్మణ్, ఎంపీటీసీ సభ్యుడు సెగ్గే సత్తిబాబు పాల్గొన్నారు.


కొయ్యూరు, న్యూస్‌టుడే: మంప పంచాయతీ గంగవరం గ్రామంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు శివరామరాజు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. తెదేపా నేతలు రాజుబాబు, కె.రాంబాబు, ఎల్‌.అప్పారావు, ఎ.సత్తిబాబు, ఎస్‌.రామకృష్ణ పాల్గొన్నారు. ఎంపీడీవో ఎంపీడీవో సీతయ్య, మండల పరిషత్‌ ఏవో బాలమురళీకృష్ణ, ఏపీఎం గాంధీ, రాజేంద్రపాలెం సర్పంచి సింహాచలం కార్యాలయంలో వీక్షించారు.   


జి.మాడుగుల: మద్దిగరువులో తెదేపా బూత్‌ అధ్యక్షుడు కె.రమేష్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. నాయకులు చిన్నారావు, చంటిబాబు, బొంజిబాబు, ప్రసాద్‌ పాల్గొన్నారు.
అరకులోయ, డుంబ్రిగుడ: అరకులోయ గిరిజన మ్యూజియం ఆవరణలో అధికారులు తెర ఏర్పాటు చేశారు. పెదలబుడు ఈవో, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. డుంబ్రిగుడ మండల పరిషత్తు కార్యాలయంలో ప్రత్యేకంగా తెర ఏర్పాటు చేశారు. ఎంపీడీవో జయఉమా, మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు ఇంజినీర్లు పాల్గొన్నారు.


సీలేరు, న్యూస్‌టుడే: సీలేరు మెయిన్‌రోడ్డు సెంటర్‌లో తెర ఏర్పాటు చేశారు. కేక్‌ కట్‌ చేసి సంబరాలు నిర్వహించారు. తెదేపా అరకు పార్లమెంటరీ బీసీ విభాగం అధికార ప్రతినిధి తిరుమలరావు, నాయకులు బొర్రా కృష్ణ, ఉప సర్పంచి కె.వల్లీప్రసాద్‌ పాల్గొన్నారు. ధారకొండలో జరిగిన వేడుకల్లో తెదేపా నాయకులు సరస్వతిరావు, శోభా జగన్, సుందరరావు, కోటి, గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు. 


రాజవొమ్మంగి: చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి మండలం నుంచి అధిక సంఖ్యలో తెదేపా, జనసేన, భాజపా నాయకులు తరలివెళ్లారు. కార్యక్రమంలో తెదేపా, జనసేన నేతలు డి.శివరామచంద్రరాజు, జి.పెద్దిరాజు, బి.త్రిమూర్తులు, తెదేపా మండల ప్రధాన కార్యదర్శి ఎం.కేశవ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంపీడీవో కార్యాలయంలోడిజిటల్‌ స్క్రీన్‌ను ఏర్పాటుచేశారు. తహసీల్దార్‌ సత్యనారాయణ, ఎంపీడీవో యాదగిరీశ్వరరావు పాల్గొన్నారు.  


గూడెంకొత్తవీధి: జీకేవీధి ఎంపీటీసీ సభ్యురాలు రీమల రాజేశ్వరి ఆధ్వర్యంలో కేకు కోశారు. తెదేపా రాష్ట్ర ఎస్టీసెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి కొర్రా బలరాం పాల్గొన్నారు. 


గంగవరం: స్థానిక వై జంక్షన్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటుపై సంబరాలు జరుపుకొన్నారు. మండలాధ్యక్షుడు కుంజం సిద్ధు శివదుర్గ ఆధ్వర్యంలో తెదేపా నేత బద్రి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై పాతగంగవరం, కొత్తగంగవరం గ్రామాల్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని