logo

డుడుమ డ్యాం వద్ద ఎలుగు కలకలం

మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్కేంద్రానికి చెందిన డుడుమ జలాశయం వద్ద మంగళవారం రాత్రి ఎలుగు బంటి కలకలం సృష్టించింది.

Published : 13 Jun 2024 03:19 IST

ముంచంగిపుట్టు గ్రామీణం, న్యూస్‌టుడే: మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్కేంద్రానికి చెందిన డుడుమ జలాశయం వద్ద మంగళవారం రాత్రి ఎలుగు బంటి కలకలం సృష్టించింది. జలాశయం ఆపరేటర్‌ గది వద్దకు వచ్చిన ఎలుగు బంటిని చూసి డి.డ్యాం ఆపరేటర్, సెక్యూరిటీ సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. పలుమార్లు దాన్ని తరిమేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు ఒక వాహనం సాయంతో దానిని సంగడ కొండమీదకు తరిమారు. ప్రస్తుతం అటవీ ప్రాంతాల్లో పండ్లు సరిగా దొరకకపోవడంతో జలాశయం వద్దకు వచ్చి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని