logo

టీటీసీ అభ్యర్థులకు ఆగస్టులో పరీక్షలు

టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికెట్‌ (టీటీసీ) కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖాధికారిణి ఎం. వెంకటలక్ష్మమ్మ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Published : 14 Jun 2024 01:43 IST

నెహ్రూచౌక్‌ (అనకాపల్లి), న్యూస్‌టుడే: టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికెట్‌ (టీటీసీ) కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖాధికారిణి ఎం. వెంకటలక్ష్మమ్మ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు పరీక్ష రుసుము, పరీక్ష కేంద్రాలు సంబంధించిన వెబ్‌సైట్‌ www.bse.ap.gov.in పరిశీలించాలన్నారు. 
సదుపాయాలను సద్వినియోగం చేసుకోండి: పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారిణి వెంకటలక్ష్మమ్మ పేర్కొన్నారు. స్థానిక జీవీఎంసీ పట్టణ ఉన్నత పాఠశాలలను సందర్శించారు. సౌకర్యాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో నూతనంగా చేరే విద్యార్థులకు ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. కొన్ని పాఠశాలల్లో తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి, వారి సమక్షంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేశారు. తొలిరోజు 40 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని