logo

చంద్రబాబు పాలనలో రాష్ట్రాభివృద్ధి

చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆడాకుల పంచాయతీ కిష్టారం గ్రామంలో తెదేపా ఎస్టీసెల్‌ ప్రధాన కార్యదర్శి జంపా వెంకటరమణ, స్థానిక నేతలు జోగారావు, బ్రహ్మాజీ, కోనంగి సత్య ఆధ్వర్యంలో గురువారం మొక్కలు నాటారు.

Published : 14 Jun 2024 01:52 IST

వీఆర్‌పురంలో కేకు కోస్తున్న తెలుగు తమ్ముళ్లు

కొయ్యూరు, న్యూస్‌టుడే: చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆడాకుల పంచాయతీ కిష్టారం గ్రామంలో తెదేపా ఎస్టీసెల్‌ ప్రధాన కార్యదర్శి జంపా వెంకటరమణ, స్థానిక నేతలు జోగారావు, బ్రహ్మాజీ, కోనంగి సత్య ఆధ్వర్యంలో గురువారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజలందరికీ సుపరిపాలన అందుతుందన్నారు. తెదేపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 
వరరామచంద్రాపురం, రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: మండలంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగారు. ముందుగా కేకు కోసి పంచారు. అనంతరం చంద్రబాబు చిత్రపటం పెట్టుకుని జేజేలు పలికారు. తెదేపా మండల అధ్యక్ష, కార్యదర్శులు ఆచంట శ్రీను, కన్నారావు, సవలం రాజు, భాగ్యలక్ష్మి, రామారావు తదితరులు పాల్గొన్నారు. సింగంపల్లిలో తెదేపా నాయకులు పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెదేపా మండలాధ్యక్షుడు    జి.పెద్దిరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా శిరీషాదేవి గెలుపొందిన నేపథ్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. జడ్పీటీసీ సభ్యురాలు వి.జ్యోతి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎం.కేశవ్‌ తదితరులు పాల్గొన్నారు.

జనసైనికుల సంబరాలు

చింతపల్లి గ్రామీణం: జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా జనసైనికులు సంబరాలు జరుపుకొన్నారు. గురువారం అంతర్ల గ్రామంలో జనసేన యూత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులు శంకర్, ప్రసాద్‌ల ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి, బాణసంచా కాల్చారు. శ్రీను, భార్గవ, కుమార్, తెదేపా నాయకులు బాలరాజు, సోమరాజు, భాజపా నాయకులు బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.  

కిష్టారంలో మొక్క నాటుతున్న నేతలు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని