logo

నాన్నమ్మ లేని లోకంలో నేనెందుకని!

తనను ఎంతో ప్రేమించే నాన్నమ్మ మృతి చెందడంతో మనస్తాపానికి గురైన యువతి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Published : 14 Jun 2024 01:54 IST

మనస్తాపంతో యువతి ఆత్మహత్య

రాధమ్మ మృతదేహం 

కొయ్యూరు, న్యూస్‌టుడే: తనను ఎంతో ప్రేమించే నాన్నమ్మ మృతి చెందడంతో మనస్తాపానికి గురైన యువతి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మఠంభీమవరం పంచాయతీ బొడ్డుమామిడిలంక గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కండ్ల రాధమ్మ (19) తల్లి చిన్న వయసులోనే మృతి చెందింది. ఆ తర్వాత సోదరుడు చనిపోయాడు. తండ్రి గంగయ్య రెండో వివాహం చేసుకోవడంతో అప్పటి నుంచి రాధమ్మను ఆమె నానమ్మ లక్ష్మమ్మ ఎంతో అపురూపంగా చూసుకునేది. లక్ష్మమ్మ అనారోగ్యంతో గత నెలలో మృతిచెందింది. అప్పటి నుంచి యువతి మనస్తాపానికి గురైంది. బుధవారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే కుటుంబీకులు గుర్తేడు పీహెచ్‌సీకి, అక్కడ నుంచి రంపచోడవరం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యసేవల నిమిత్తం రాజమహేంద్రవరం తరలించగా చికిత్స పొందుతూ అక్కడే మృతిచెందింది. మంప ఎస్సై లోకేష్‌కుమార్‌ రాజమహేంద్రవరం వెళ్లి కేసు నమోదు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని