logo

చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి దుర్మరణం

ఉపమాక నూకాంబిక ఆలయం సమీపంలో చెట్టుపై నుంచి జారిపడి కల్లుగీత కార్మికుడు మృతిచెందాడు.

Updated : 17 Jun 2024 02:14 IST

నక్కపల్లి: ఉపమాక నూకాంబిక ఆలయం సమీపంలో చెట్టుపై నుంచి జారిపడి కల్లుగీత కార్మికుడు మృతిచెందాడు. హెడ్‌ కానిస్టేబుల్‌ కిశోర్‌ తెలిపిన వివరాల ప్రకారం... నక్కపల్లికి చెందిన కర్రి శ్రీను (26) ఆదివారం మధ్యాహ్నం తాటిచెట్టుపైకి ఎక్కి కల్లు తీస్తుండగా జారిపడిపోయాడు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు మృతదేహం చూసి రోదించారు. శ్రీనుకు  తల్లిదండ్రులు, అక్క, తమ్ముడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ విద్యార్థి దుర్మరణం

గుడిస పర్యటకంలో అపశ్రుతి

ప్రమాదానికి కొద్దిసేపు ముందు శ్రీకాంత్‌ తీసుకున్న చిత్రం

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: మారేడుమిల్లి మండలంలోని ‘గుడిస’ పర్యటకంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ విద్యార్థి దుర్మరణం పాలవ్వగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడకు చెందిన శ్రీకాంత్, శేషన్‌ స్నేహితులు. వీరిద్దరూ రాజమహేంద్రవరంలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నారు. శనివారం వై.రామవరంలోని తమ బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై వచ్చారు. అక్కడి నుంచి మారేడుమిల్లి మండలం పుల్లంగి పంచాయతీ పరిధిలోని పర్యటక ప్రదేశం ‘గుడిస’ అందాలు చూడటానికి వచ్చారు. ఆదివారం ఉదయం తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని విజయవాడ నుంచి సీలేరు వెళ్తున్న మరో ద్విచక్రవాహనం ఎదురుగా వస్తూ బలంగా ఢీకొంది. బోదులూరు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో శ్రీకాంత్, శేషన్‌తోపాటు మరో యువకుడికి గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన బోదులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్సులో రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి వెళ్లేసరికే శ్రీకాంత్‌ మృతిచెందాడు. శ్రీకాంత్‌ను ఢీకొన్న యువకుల ప్రవర్తన ఆనుమానాస్పదంగా ఉండటం, వారి ద్విచక్ర వాహనానికి సంబంధించి ఎటువంటి దస్త్రాలు లేకపోవడంతో వీరు గంజాయి కోసం ఈ ప్రాంతానికి వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని