logo

రామోజీరావు తెలుగు జాతికే గర్వకారణం

ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి, తెలుగు భాషాభ్యున్నతికి పాటుపడిన రామోజీరావు జాతికే గర్వకారణమని అనకాపల్లికి చెందిన సామాజికవేత్త పి.ఎం.ఎల్‌.నర్సింహమూర్తి అన్నారు.

Updated : 17 Jun 2024 02:15 IST

విద్యార్థులతో నిర్వాహకులు

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి, తెలుగు భాషాభ్యున్నతికి పాటుపడిన రామోజీరావు జాతికే గర్వకారణమని అనకాపల్లికి చెందిన సామాజికవేత్త పి.ఎం.ఎల్‌.నర్సింహమూర్తి అన్నారు. అనకాపల్లిలోని పొట్టి శ్రీరాములు సేవా భవనంలో ఆదివారం రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించి పాఠశాలల విద్యార్థులకు క్యారేజీలు పంపిణీ చేశారు. తెలుగుజాతి జీవనంలో ‘ఈనాడు’ భాగమైందన్నారు. దాని స్థాపించిన మహనీయుడ్ని స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ మేనేజర్‌ శేషుకుమార్,  ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ అధ్యక్షురాలు శ్రీదేవి, మంజు భార్గవి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని