logo

మారని రాత.. తప్పని డోలీమోత!

రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజన ప్రాంతంలో డోలీమోతలు నిత్యకృత్యమవుతున్నాయి. అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ బూరుగ గ్రామానికి చెందిన బడ్నాయిన కొత్తమ్మ గర్భిణి. సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈమెకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి.

Published : 18 Jun 2024 01:56 IST

అరకులోయ, అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజన ప్రాంతంలో డోలీమోతలు నిత్యకృత్యమవుతున్నాయి. అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ బూరుగ గ్రామానికి చెందిన బడ్నాయిన కొత్తమ్మ గర్భిణి. సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈమెకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. 108కు ఫోన్‌ చేయగా వర్షం, రహదారి బాగోలేని కారణంగా రాయపాడు జంక్షన్‌ వరకు గర్భిణిని తీసుకురావాలని సిబ్బంది తెలిపారు. 9 కిలోమీటర్లు డోలీతో ఆమెను మోసుకెళ్లినట్లు భర్త బొంజుబాబు తెలిపారు. అక్కడి నుంచి అంబులెన్సులో ఎస్‌.కోట ఆసుపత్రికి తరలించారు.
బీ అరకులోయ మండలం మాడగడ పంచాయతీ జాకరవలస గ్రామానికి వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేదు. ఈ గ్రామానికి చెందిన యువకుడు డానియల్‌ అనారోగ్యం బారిన పడటంతో సోమవారం ఆసుపత్రికి తరలించేందుకు మూడు కిలోమీటర్లు డోలీలో మోసుకొని ప్రధాన రహదారికి తీసుకొచ్చారు. మారుమూల గ్రామాలకు రహదారులు నిర్మించాలని సీపీఎం నాయకులు గోవింద్, స్థానికులు కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని