logo

ఘాట్‌ రోడ్డులో రాకపోకలకు అంతరాయం

పాడేరు ఘాట్‌ రోడ్డులోని ఏసుక్రీస్తు విగ్రహం సమీపంలో సోమవారం మధ్యాహ్నం వాహనాల రాకపోకలు స్తంభించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Published : 18 Jun 2024 02:00 IST

ఏసుక్రీస్తు బొమ్మ మలుపు వద్ద వాహనాల రద్దీ

పాడేరు, న్యూస్‌టుడే: పాడేరు ఘాట్‌ రోడ్డులోని ఏసుక్రీస్తు విగ్రహం సమీపంలో సోమవారం మధ్యాహ్నం వాహనాల రాకపోకలు స్తంభించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాడేరు వైపు నుంచి మైదాన ప్రాంతానికి వెళ్తున్న ఓ వ్యాను ఘాట్‌ రోడ్డు మలుపు వద్ద నిలిపివేయడంతో ఈ సమస్య నెలకొందని వాహనచోదకులు తెలిపారు. దాదాపు గంటపాటు వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ నివారణ చర్యలు చేపట్టారు. ఈ రహదారిలో అప్రమత్తంగా వాహనాలు నడపాలని పోలీసులు సూచిస్తున్నారు.


బియ్యం వ్యాను బోల్తా


కొత్తభల్లుగుడ సమీపంలో ప్రమాదానికి గురైన వ్యాను

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: అరకులోయ మండలం కొత్తభల్లుగుడ సమీపంలో ప్రధాన రహదారిపై వ్యాను అదుపుతప్పి బోల్తా పడింది. మైదాన ప్రాంతం నుంచి బియ్యం లోడుతో వస్తున్న వ్యాను కొత్తభల్లుగుడ మలుపు వద్దకు వచ్చేటప్పటికి అదుపుతప్పి రహదారి కిందకు జారిపోయింది. వాహనంలో ఉన్న ముగ్గురు సకాలంలో కిందకు దూకెయ్యడంతో చిన్నపాటి గాయాలతో బయట పడ్డారు. బియ్యం బస్తాలను స్థానిక వ్యాపార సముదాయాలకు ఇతర వాహనాల్లో తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని