logo

నిలిచిన పాపికొండలు విహారయాత్ర

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టు పర్యటన నేపథ్యంలో గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యటక బోట్లను తాత్కాలికంగా నిలిపివేశామని కంట్రోల్‌ రూం మేనేజర్‌ నాగరాజు తెలిపారు.

Published : 18 Jun 2024 02:02 IST

పోశమ్మగండి వద్ద  పర్యటక బోట్లు

దేవీపట్నం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టు పర్యటన నేపథ్యంలో గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యటక బోట్లను తాత్కాలికంగా నిలిపివేశామని కంట్రోల్‌ రూం మేనేజర్‌ నాగరాజు తెలిపారు. దీంతో అమ్మవారి ఆలయం వద్ద ఉన్న 15 బోట్లు నిలిచిపోయాయి. మంగళవారం నుంచి విహారయాత్రకు బోట్లు వెళ్లనున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే విహారయాత్రకు వెళ్లే సందర్శకుల వాహనాలన్నీ రాజమహేంద్రవరం నుంచి పురుషోత్తపట్నం మీదుగా పోశమ్మగండి వస్తాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా అధికారులు అటువైపుగా వెళ్లే వాహనాలను ముందుగానే నిలిపివేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు ఏజెన్సీ నుంచి పోశమ్మగండి మీదుగా సీతానగరం వైపు వెళ్లే అన్ని వాహనాలను సీఎం ప్రాజెక్టు పర్యటన పూర్తయ్యేవరకూ నిలిపివేశారు. అంతకుముందు ప్రత్యేక పోలీసులు పోశమ్మగండి నుంచి అంగుళూరు కొండవరకూ ప్రాజెక్టు ప్రాంతాన్ని జల్లెడపట్టారు. బయట వాహనాలను ప్రాజెక్టు ప్రాంతంలోకి రాకుండా చర్యలు తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని