logo

ఆంగ్లేయుల సమాధులకు రక్షణ: అయ్యన్న

విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు చేతిలో హతమైన బ్రిటిష్‌ సైనికాధికారులు హైటర్, కవర్డ్‌ల సమాధుల ప్రాంత పరిరక్షణకు తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

Updated : 18 Jun 2024 06:22 IST

అయ్యన్నతో చర్చిస్తున్న వీరభద్రరావు తదితరులు

నర్సీపట్నం, న్యూస్‌టుడే: విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు చేతిలో హతమైన బ్రిటిష్‌ సైనికాధికారులు హైటర్, కవర్డ్‌ల సమాధుల ప్రాంత పరిరక్షణకు తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. అల్లూరి జాతీయ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు, పలువురు ప్రతినిధులు సోమవారం అయ్యన్నను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. వీరభద్రరావు మాట్లాడుతూ మన్యం పితూరీకి ఈ సైనికాధికారుల సమాధులు ఓ సాక్ష్యం అన్నారు. నర్సీపట్నం నడిబొడ్డున కోట్ల రూపాయల విలువైన ఈ స్థలం కబ్జాకు కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇటీవల తాము అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆక్రమణలు తొలగింపజేశామని, ఆవరణలోని వ్యర్థాలన్నీ శ్రమదానంతో తొలగించి సమాధులను శుభ్రం చేశామని వివరించారు. చరిత్రాత్మక ఈ సమాధులను సందర్శించేందుకు ఇటీవల కాలంగా అనేకమంది విచ్చేస్తున్నారని గుర్తు చేశారు. ఆవరణంతా ఉద్యానంగా తయారు చేయించాలని కోరారు. ప్రహరీ నిర్మాణానికి అనుమతి ఇప్పిస్తే విరాళాలతో నిర్మించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సంఘం కార్యదర్శులు శివంగి నాగేశ్వరరావు, శ్యామల వరలక్ష్మి, నాయకులు వెంకటేశ్వరరావు, శంకరరావు, వర్మ, శరత్‌ పాల్గొన్నారు.

అయ్యన్నపాత్రుడును ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. శాసన సభాపతి పదవికి ఆయన పేరును అధిష్ఠానం పరిశీలిస్తున్న నేపథ్యంలో అయ్యన్న స్వగృహానికి ప్రముఖుల తాకిడి అధికమైంది. పలువురు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ నర్సీపట్నం పేరు ఇకపై శాసనసభలో మరింతగా మార్మోగుతుందని ప్రశంసించారు. కొత్తగా నియమితులైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి శ్రీబాలాజీ, నర్సీపట్నం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వీరజ్యోతి సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని