logo

ఆకాశాన్నంటుతున్న అల్లం ధర

అల్లూరి జిల్లాలో అల్లం ధరకు రెక్కలొచ్చాయి. కేజీ రూ.200 వరకూ ప్రస్తుతం ధర పలుకుతోంది. ఈ ధర విషయంలో మన్యంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది.

Published : 18 Jun 2024 02:10 IST

కేజీ రూ.200 పైనే

చింతపల్లి, న్యూస్‌టుడే: అల్లూరి జిల్లాలో అల్లం ధరకు రెక్కలొచ్చాయి. కేజీ రూ.200 వరకూ ప్రస్తుతం ధర పలుకుతోంది. ఈ ధర విషయంలో మన్యంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టిలా తయారవుతుంది. ఒక్కోసారి అల్లాన్ని కేజీ రూ.10కి కొనేవారు లేక గిరిరైతులు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంటోంది. ఏడాదికి రెండు సార్లు ఈ పంట దిగుబడికి వస్తుంది. ఈ ఏడాది ఎండలు అధికంగా ఉండటంతోపాటు అదనులో వర్షాలు లేక పంట సరిగా దిగుబడికి రాలేదు. మరికొన్ని చోట్ల తెగుళ్ల కారణంగా దిగుబడి బాగా తగ్గింది. దీంతో మార్కెట్‌లో దీనికి గిరాకీ పెరిగింది. విత్తనాల కోసం రైతులు భూమిలో వేసుకున్న అల్లానికి ప్రస్తుతం మంచి ధరలు పలుకుతున్నాయి. రైతులు కొన్ని చోట్ల పరిమితంగా తవ్వి సంతలకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. తక్కువగా వస్తున్న పంటను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం కేజీ అల్లం ధర రూ.200గా ఉంది. అదికూడా మార్కెట్‌లో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండటం లేదు. వారపు సంతల్లో చిన్న, చిన్న పోగులుగా వేసి రూ.50లకు విక్రయిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని