logo

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు

ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని అరెస్టు చేశామని పాడేరు ఏఎస్పీ ధీరజ్‌ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 18 Jun 2024 02:10 IST

నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ ధీరజ్, సీఐ నవీన్‌కుమార్, ఎస్సై లక్ష్మణ్‌రావు

పాడేరు, న్యూస్‌టుడే: ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని అరెస్టు చేశామని పాడేరు ఏఎస్పీ ధీరజ్‌ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 11న పాడేరు మోదకొండమ్మ జాతరలో గుడివాడ కాలనీలోని సీబీఎం చర్చి సమీపంలో ఓ ఇంట్లో నిద్రపోతున్న ఆరేళ్ల బాలికను నిందితుడు ఎత్తుకొని పక్కన నిర్మాణంలో ఉన్న రెండు అంతస్తుల భవనం వద్దకు తీసుకెళ్లి బలత్కారం చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసుపై రెండు బృందాలు ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టాయని చెప్పారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నామని చెప్పారు. బాలికలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోర్టులో నిందితుడికి కఠిన శిక్ష పడేటట్టు చేస్తామన్నారు. ఈ కేసు దర్యాప్తునకు సహకరించిన పాడేరు సీఐ నవీన్‌కుమార్, ఎస్సై లక్ష్మణ్‌రావులను అభినందించారు. నిందితుడి పేరు, గ్రామం ఇప్పుడు తెలియజేయకూడదన్నారు. శిక్షపడిన తరువాత పూర్తి వివరాలు తెలియజేస్తామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని