logo

చంద్రబాబు రాకతో ఆనందం

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న కొద్దిరోజుల్లోనే పోలవరం ప్రాజెక్టును సందర్శించడంతో ముంపు గ్రామాల నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Published : 18 Jun 2024 02:13 IST

దేవీపట్నం, న్యూస్‌టుడే: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న కొద్దిరోజుల్లోనే పోలవరం ప్రాజెక్టును సందర్శించడంతో ముంపు గ్రామాల నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ పోశమ్మగండి, ఎగువ కాపర్‌ డ్యాం సమీపంలో రెండుసార్లు చక్కర్లు కొట్టింది. సీఎం స్వయంగా రావడంతో ఈ ప్రాంతాల్లోని నిర్వాసితులు ఎంతో సంతోషం వెలిబుచ్చారు. అయిదేళ్ల వైకాపా పాలనలో పునరావాస కాలనీలు పూర్తి కాకపోవడంతోపాటు ఆర్‌అండ్‌ఆర్‌లో అర్హులుగా గుర్తించిన వారికి సైతం ప్యాకేజీలు ఇవ్వకపోవడంతో తామంతా అప్పులపాలయ్యామని ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు రాకతో పోలవరం ప్రాజెక్టుకు పూర్వ వైభవం వచ్చిందని, తమ సమస్యలు త్వరలో తీరుతాయని నిర్వాసితులు  ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని