logo

గంజాయి రవాణాను అడ్డుకోవాలి

గంజాయి రవాణా అడ్డుకోవాలని, విచ్చలవిడిగా అమ్మకాలు సాగించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు.

Updated : 18 Jun 2024 06:20 IST

మాట్లాడుతున్న హోం మంత్రి అనిత

విశాఖపట్నం, న్యూస్‌టుడే: గంజాయి రవాణా అడ్డుకోవాలని, విచ్చలవిడిగా అమ్మకాలు సాగించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. సోమవారం సాయంత్రం గవర్నర్‌ బంగ్లాలో ఆమె పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, నగర పోలీసు కమిషనర్‌ రవిశంకర్, జాయింట్‌ పోలీసు కమిషనర్‌ ఫకీరప్పలతోపాటు వివిధ స్థాయిల పోలీసు అధికారులు పాల్గొన్నారు. గవర్నర్‌ బంగ్లాలో కలెక్టర్, సీపీ, జేసీపీ, ఇతర అధికారులు ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం పోలీసు అధికారులతో అనిత సమీక్ష నిర్వహించారు. మాదకద్రవ్యాలు, గంజాయి రవాణా, సరఫరాను అడ్డుకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు యంత్రాంగంతో సమీక్షించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీసు సిబ్బంది ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ఫిర్యాదు చేసేందుకు వచ్చేవారికి గౌరవం ఇవ్వాలని సూచించారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులను కలెక్టర్, సీపీ ఆమె దృష్టికి తీసుకెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని