logo

36 కేజీల గంజాయి పట్టివేత

మైదాన ప్రాంతాలకు రవాణా చేస్తున్న 36 కేజీల గంజాయిని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. కె.కోడాపల్లి పంచాయతీ బందవీధి కూడలిలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా..

Updated : 20 Jun 2024 04:23 IST

గంజాయి, నిందితులతో పోలీసులు 

జి.మాడుగుల, న్యూస్‌టుడే: మైదాన ప్రాంతాలకు రవాణా చేస్తున్న 36 కేజీల గంజాయిని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. కె.కోడాపల్లి పంచాయతీ బందవీధి కూడలిలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా.. అటుగా వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఆపి పరిశీలించారు. అందులో 36 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీన్ని తరలిస్తున్న అనకాపల్లి జిల్లా చీడికాడ మండలానికి చెందిన గోకాడ వరహామూర్తి, డోకల అప్పారావులతోపాటు జి.మాడుగుల మండలం పెదలోచలి పంచాయతీ సిందుగుల గ్రామానికి చెందిన కోడా రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని సీజ్‌ చేశారు. ముగ్గురిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని