logo

అచ్యుతాపురంలో అగ్ని ప్రమాదం

అచ్యుతాపురంలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాల వెనుక ఉన్న వారపు సంతలో పాకలకు మంటలకు అంటుకొని రెండు పాకలు పూర్తిగా కాలిపోయాయి.

Updated : 20 Jun 2024 04:23 IST

సంతలో కాలిపోతున్న వ్యాపారులు పాకలు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: అచ్యుతాపురంలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాల వెనుక ఉన్న వారపు సంతలో పాకలకు మంటలకు అంటుకొని రెండు పాకలు పూర్తిగా కాలిపోయాయి. మిగిలిన పాకలకు అంటుకోకుండా సెజ్‌ ఏపీఐఐసీకి చెందిన అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను అదుపులోకి తేవడంతో పెద్దప్రమాదం తప్పింది. వారపుసంతలో మంటలు ఎగిసిపడడంతో మండల ప్రజలు ఆందోళనతో పరులు తీశారు. 

నాతవరం, న్యూస్‌టుడే: నాతవరం బంగారుగెడ్డ ప్రాంతంలో అయిదు పశువుల పాకలను దుండగులు కాల్చేశారు. అదృష్టవశాత్తూ రాత్రి వేళ పశువులను రైతులు ఇళ్లకు తోలుకు వెళ్లడంతో భారీ నష్టం తప్పింది. మంగళవారం రాత్రి 9 గంటల వరకూ తాము అక్కడే ఉన్నామని, ఆ తరవాతే పాకలు అగ్నికి ఆహుతి అయినట్లు బాధితులు తెలిపారు. ముళ్ల అమ్మన్న, చింతకాయల సత్తిబాబు, కంబే సూరిబాబు, సామర్ల దేవత తదితరుల పాకలు దగ్ధమైనట్లు గుర్తించారు. తెదేపా నాయకులు పారుపల్లి కొండబాబు, విజయకుమార్‌ ఘటన స్థలానికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని