logo

కూటమి పాలనలో రాష్ట్రం సుభిక్షం

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు  బాధ్యతలు చేపట్టడంతో తితిదే మాజీ ఛైర్మన్‌ పప్పల చలపతిరావుతో సహా పలువురు తెదేపా నాయకులు తిరుపతి వేంకటేశ్వరస్వామికి  మొక్కు తీర్చుకున్నారు.

Updated : 20 Jun 2024 04:24 IST

తిరుపతిలో మొక్కు తీర్చుకున్న చలపతిరావు, తెదేపా నాయకులు

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు  బాధ్యతలు చేపట్టడంతో తితిదే మాజీ ఛైర్మన్‌ పప్పల చలపతిరావుతో సహా పలువురు తెదేపా నాయకులు తిరుపతి వేంకటేశ్వరస్వామికి  మొక్కు తీర్చుకున్నారు. మున్సిపల్‌ కౌన్సిలర్‌ మజ్జి రామకృష్ణ, తెదేపా పట్టణపార్టీ అధ్యక్షులు గొర్లె నానాజీ, ఆర్‌ఎస్‌.నాగేశ్వరరావు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి బొద్దపు శ్రీనివాసరావు, కరణం రవికుమార్‌ తదితరులంతా మొక్కు చెల్లించిన వారిలో ఉన్నారు. 

కశింకోటలో కూటమి నాయకుల సంబరాలు

కశింకోట, న్యూస్‌టుడే: కశింకోటలో పెద్ద్ద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో జనసేన నాయకులు బుదిరెడ్డి చిన్న ఆధ్వర్యంలో నాయకులు బాణసంచా కాల్చి, కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. బుదిరెడ్డి మోహన్, చిన్ని జనార్దన్, సిదిరెడ్డి శ్రీనివాసరావు, వేగి కోటి, తాకాశి కృష్ణ, పెంటకోట రాము, కలవలపల్లి రాజారావు తదితరులు పాల్గొన్నారు. 

ఎలమంచిలి, న్యూస్‌టుడే: రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు మంగళవారం అమరావతిలో  ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఈ కార్యక్రమానికి ఎలమంచిలి నుంచి పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు తరలివెళ్లి ఘనంగా సన్మానించారు. తమ కల నేరవేరిందని వీరంతా ఆనందం వ్యక్తం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు