logo

చింతపల్లిలో డ్రాగన్‌ ఫ్రూట్‌

డ్రాగన్‌ ఫ్రూట్స్‌ ఇవి ఒకప్పుడు  విదేశాలు లేదా అతిశీతల రాష్ట్రాల్లో మాత్రమే పండే పండ్లు. ప్రస్తుతం చింతపల్లి ప్రాంతంలో వీటిని అధికంగా విక్రయిస్తున్నారు.

Updated : 20 Jun 2024 04:36 IST

చింతపల్లి, న్యూస్‌టుడే: డ్రాగన్‌ ఫ్రూట్స్‌ ఇవి ఒకప్పుడు  విదేశాలు లేదా అతిశీతల రాష్ట్రాల్లో మాత్రమే పండే పండ్లు. ప్రస్తుతం చింతపల్లి ప్రాంతంలో వీటిని అధికంగా విక్రయిస్తున్నారు. అత్యంత పోషక విలువలతోపాటు అనేక ఔషధ గుణాలు కలిగిన ఈ పండ్లు ధర విదేశాల్లో కేజీ రూ.250 నుంచి రూ.400 వరకూ ఉంటుంది. వీటిలో ఎరుపు, తెలుపు రెండు రకాలున్నాయి. ప్రస్తుతం చింతపల్లితోపాటు చిట్రాళ్లగుప్పు, రాజుపాకలు ప్రాంతాల్లోని చిరు వ్యాపారులు సుమారు 750 గ్రాముల బరువున్న వీటిని ఒక్కొక్కటి రూ. 100కు విక్రయిస్తున్నారు. ఏది ఏమైనా కేవలం విదేశాల్లో మాత్రమే కనిపించే డ్రాగన్‌ వంటి భిన్నమైన పండ్లు ఇప్పుడు మన్యంలోని చిరు దుకాణాల్లోనూ లభ్యమవ్వడం నిజంగా ప్రత్యేకతనే చెప్పాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని