logo

ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవ కోలాహలం

అరకులోయ శాసనసభ్యుడిగా రేగం మత్స్యలింగం, పాడేరు ఎమ్మెల్యేగా మత్స్యరాస విశ్వేశ్వరరాజు శుక్రవారం శాసనసభలో ప్రమాణస్వీకారం చేశారు.

Updated : 22 Jun 2024 05:19 IST

అరకులోయ, పాడేరు, న్యూస్‌టుడే: అరకులోయ శాసనసభ్యుడిగా రేగం మత్స్యలింగం, పాడేరు ఎమ్మెల్యేగా మత్స్యరాస విశ్వేశ్వరరాజు శుక్రవారం శాసనసభలో ప్రమాణస్వీకారం చేశారు. సభా సంప్రదాయాలను గౌరవిస్తూ, నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తామని దైవసాక్షిగా ప్రమాణం చేశారు. 

అసెంబ్లీలో ఎమ్మెల్యే శిరీషాదేవిని అభినందిస్తున్న సీఎం చంద్రబాబు 

రంపచోడవరం, గœంగవరం, న్యూస్‌టుడే: ఎమ్మెల్యేగా శిరీషాదేవి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ల ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమాన్ని నియోజకవర్గంలో పలుచోట్ల ప్రత్యక్ష ప్రసారంలో తిలకించే ఏర్పాట్లు చేశారు. తెదేపా, జనసేన, భాజపా నాయకులు మిరియాల విజయ్‌భాస్కర్, మాజీ ఎంపీపీ డాక్టర్‌ తీగల ప్రభ, కుంజం సిద్దు శివదుర్గ, పాము అర్జున్, కనిగిరి రాంబాబు తదితరులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.



రాష్ట్ర శాసనసభలో జిల్లా ఎమ్మెల్యేలు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. హోం మంత్రి వంగలపూడి అనిత (పాయకరావుపేట), కొణతాల రామకృష్ణ (అనకాపల్లి), బండారు సత్యనారాయణ మూర్తి (మాడుగుల), సుందరపు విజయ్‌కుమార్‌ (ఎలమంచిలి), కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు (చోడవరం), పంచకర్ల రమేష్‌బాబు (పెందుర్తి)ల అభిమానులు కూటమి నాయకులు, కార్యకర్తలు సందడి చేశారు. 



ఇటీవల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు(గాజువాక), గంటా శ్రీనివాసరావు(భీమిలి), వెలగపూడి రామకృష్ణబాబు(తూర్పు), పెతకంశెట్టి గణబాబు(పశ్చిమం), పంచకర్ల రమేశ్‌బాబు(పెందుర్తి), వంశీకృష్ణ శ్రీనివాస్‌(దక్షిణం), విష్ణుకుమార్‌రాజు(ఉత్తరం) శాసనసభలో శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.

ఈనాడు, విశాఖపట్నం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని