logo

పరిశోధనాస్థానం ఏడీఆర్‌గా అప్పలస్వామి

చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ ఎం.సురేష్‌కుమార్‌కు బదిలీ అయ్యింది.

Updated : 25 Jun 2024 03:31 IST

అప్పలస్వామికి పుష్పగుచ్ఛం అందిస్తున్న డాక్టర్‌ సురేష్‌కుమార్, డాక్టర్‌ ఉజ్వలారాణి

అనకాపల్లి, చింతపల్లి, న్యూస్‌టుడే: చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ ఎం.సురేష్‌కుమార్‌కు బదిలీ అయ్యింది. ఈయనను బాపట్ల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ కళాశాలకు బదిలీ చేశారు. ఈయన స్థానంలో అనకాపల్లి జిల్లా కొక్కిరాపల్లి నూనె గింజల పరిశోధనాస్థానం అధిపతి, ప్లాంట్‌ బ్రీడర్‌గా పనిచేస్తున్న ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామిని నియమిస్తూ ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు సోమవారం ఆయన పూర్వ ఏడీఆర్‌ సురేష్‌కుమార్‌ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈయనకు శాస్త్రవేత్త డాక్టర్‌ ఉజ్వలారాణి తదితరులు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని