logo

అవినీతికి పాల్పడిన సీసీలపై చర్యలు తీసుకోవాలి

డ్వాక్రా రుణాల పంపిణీలో అవినీతి అక్రమాలకు పాల్పడిన సీసీలపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌ డిమాండ్‌ చేశారు.

Published : 25 Jun 2024 03:15 IST

 ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడుతున్న పీఓ సూరజ్‌గనోరే

రంపచోడవరం, న్యూస్‌టుడే: డ్వాక్రా రుణాల పంపిణీలో అవినీతి అక్రమాలకు పాల్పడిన సీసీలపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం రంపచోడవరం ఐటీడీఏ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారి వద్దకు ఐటీడీఏ, వెలుగు ఏపీఓలు వచ్చినప్పటికీ ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి రావాలంటూ పట్టుబట్టారు. దీంతో ఆందోళనకారుల వద్దకు పీఓ సూరజ్‌గనోరే వచ్చారు. దీనిపై పూర్తి విచారణ చేసి వెలుగు ఏపీడీపై కూడా చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. దీంతో దీనిపై విచారణ చేయాల్సిందిగా ఐటీడీఏ ఏపీఓ శ్రీనివాసరావును పీఓ ఆదేశించారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు లోతా రామారావు, మట్ల వాణిశ్రీ,  వెంకట్, శాంతిరాజు, మండల సమాఖ్య లీడర్స్‌ సంకురమ్మ, పోషమ్మ  పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని