logo

ఊపిరాడకే చుట్టుమెట్టలో గిరిజనుల మృతి

ఊపిరి ఆడకపోవడంతో పెదబయలు మండలం చుట్టుమెట్టలో ఇద్దరు గిరిజనులు మృతి చెందారని జిల్లా వైద్యాధికారి జమాల్‌ బాషా తెలిపారు.

Published : 25 Jun 2024 03:17 IST

చుట్టుమెట్ట గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్న
జిల్లా వైద్యాధికారి జమాల్‌ బాషా తదితరులు

పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఊపిరి ఆడకపోవడంతో పెదబయలు మండలం చుట్టుమెట్టలో ఇద్దరు గిరిజనులు మృతి చెందారని జిల్లా వైద్యాధికారి జమాల్‌ బాషా తెలిపారు. చుట్టుమెట్ట గ్రామాన్ని వైద్యాధికారులు, సిబ్బందితో కలిసి సోమవారం ఆయన సందర్శించారు. అక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈనెల 19న గ్రామానికి చెందిన మహిళ అనాసమ్మ కాఫీతోటకు వెళ్లి తిరిగి వచ్చి అస్వస్థతకు గురైంది. ఆమె వద్దకు వచ్చి మంత్రాలు జపిస్తున్న సమయంలో స్థానిక భూత వైద్యుడు సహదేవ్, అనాసమ్మ తమ్ముడు త్రినాథ్‌ అకస్మాత్తుగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైద్య బృందం గ్రామంలో పర్యటించి గిరిజనులతో మాట్లాడారు. మూఢనమ్మకాలతో భూత వైద్యులను ఆశ్రయించడం సరికాదని అవగాహన కల్పించారు. సైకాలజిస్ట్‌ మాట్లాడుతూ.. గ్రామస్థులు భయాందోళనలో ఉన్నారని, మూఢనమ్మకాలు వీడాలని పేర్కొన్నారు. గిరిజనులకు బీపీ, చక్కెర, హెచ్‌బీ, సికెల్‌సెల్‌ ఎనీమియా, మలేరియా పరీక్షలు, నిర్వహించారు. గ్రామంలో నీటి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. గ్రామంలో ఐదురోజులపాటు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని స్థానిక వైద్యాధికారి నిఖిల్‌ను ఆదేశించారు. భూతవైద్యుడు ఉపయోగించిన మూలికలను స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని