logo

రైతులను ప్రోత్సహించడమే కేవీకే లక్ష్యం

ఏజెన్సీ ప్రాంతంలోని రైతులను సాగుకు ప్రోత్సహించడమే లక్ష్యంగా కృషి విజ్ఞాన కేంద్రం కృషి చేస్తుందని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్, దిల్లీ) ఉప సంచాలకులు డాక్టర్‌ ఉదమ్‌సింగ్‌ గౌతమ్‌ తెలిపారు.

Published : 25 Jun 2024 03:18 IST

వెదురుతో తయారు చేసిన టోపీలను పరిశీలిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు

రంపచోడవరం, మారేడుమిల్లి, న్యూస్‌టుడే: ఏజెన్సీ ప్రాంతంలోని రైతులను సాగుకు ప్రోత్సహించడమే లక్ష్యంగా కృషి విజ్ఞాన కేంద్రం కృషి చేస్తుందని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్, దిల్లీ) ఉప సంచాలకులు డాక్టర్‌ ఉదమ్‌సింగ్‌ గౌతమ్‌ తెలిపారు. సోమవారం రంపచోడవరం మండలం పందిరిమామిడి కేవీకేను వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్‌ జానకిరామ్, అటారి జోన్‌-10 (హైదరాబాదు) డైరెక్టర్‌ డాక్టరు షేక్‌ ఎన్‌మీరాలతో కలిసి సందర్శించారు. రైతులకు మేకల యూనిట్లతోపాటు వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. అనంతరం మారేడుమిల్లి మండలం పందిరిమామిడికోటలో రైతులతో సమావేశం నిర్వహించారు. గిరిజనులు థింసా, రేలా నృత్యాలతో వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైతులు పండించిన చిరుధాన్యాలతోపాటు పనస, గుమ్మడి తదితర పండ్లతో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి వారిని అభినందించారు. ఉదమ్‌సింగ్‌ గౌతమ్‌ మాట్లాడుతూ మన్యంలో కేవీకే చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. క్షేత్రస్థాయిలో కేవీకే శాస్త్రవేత్తలు గిరిజనులతో సమావేశాలను నిర్వహిస్తూ పంటల సాగుపై సస్యరక్షణతోపాటు అధిక దిగుబడిని సాధించేందుకు సూచనలు, సలహాలు, ఆర్థిక భరోసాను ఇస్తున్నారని పేర్కొన్నారు. రబ్బరు తోటలను సందర్శించి పరిశీలించారు. కేవీకే అధిపతి డాక్టరు లలితాకామేశ్వరి, వివిధ విభాగాల శాస్త్రవేత్తలు వీరాంజనేయులు, క్రాంతికుమార్, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని