logo

మన్యాన్ని అభివృద్ధి చేస్తాం

రాష్ట్ర విద్యా, ఐటీ, మానవవనరుల శాఖా మంత్రి నారా లోకేశ్‌ను పాడేరుకు చెందిన తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిల్లు వెంకటరమేష్‌నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 25 Jun 2024 03:20 IST

మంత్రి లోకేశ్‌తో తెదేపా రాష్ట్ర కార్యదర్శి వెంకటరమేష్‌నాయుడు

చింతపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్ర విద్యా, ఐటీ, మానవవనరుల శాఖా మంత్రి నారా లోకేశ్‌ను పాడేరుకు చెందిన తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిల్లు వెంకటరమేష్‌నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో మంత్రిని కలిసి అభినందనలు తెలిపారు. పాడేరు, అరకులోయ నియోజకవర్గాల్లో కూటమి ఓటమిపాలైనా.. మన్యాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చినట్లు రమేష్‌నాయుడు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని