logo

పక్కాగా మధ్యాహ్నభోజన పథకం అమలు

విద్యార్థులకు ఉన్నత చదువు అందించడంతోపాటు మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావు ఆదేశించారు.

Published : 25 Jun 2024 03:25 IST

అరుకులో విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో బ్రహ్మాజీరావు

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: విద్యార్థులకు ఉన్నత చదువు అందించడంతోపాటు మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావు ఆదేశించారు. అరుకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సోమవారం ఆయన సందర్శించారు. విద్యార్థులకు అందించే భోజనంతోపాటు పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పాఠ్య, నోట్‌ పుస్తకాల పంపిణీపై ఆరా తీశారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు సమయపాలనపై దృష్టిపెడుతూ విద్యాభివృద్ధికి పాటుపడాలన్నారు. పది విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఉత్తమ ఫలితాలు వచ్చేలా చూడాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని