logo

సమస్యల పరిష్కారమే లక్ష్యం

ఏజెన్సీ ప్రాంతంలో ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి అధికారి పనిచేయాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి సూరజ్‌ గనోరే ఆదేశించారు.

Published : 25 Jun 2024 03:27 IST

ఐటీడీఏ పీఓ సూరజ్‌

వినతులు స్వీకరిస్తున్న అధికారులు 

రంపచోడవరం, న్యూస్‌టుడే: ఏజెన్సీ ప్రాంతంలో ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి అధికారి పనిచేయాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి సూరజ్‌ గనోరే ఆదేశించారు. సోమవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో సబ్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌కుమార్, ఐటీడీఏ ఏపీఓ శ్రీనివాసరావుతో కలిసి ‘ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో వివిధ సమస్యలపై 38 దరఖాస్తులను అందాయి. దేవీపట్నం మండలం తున్నూరు పంచాయతీలో మామిడివలస, చింతలగూడెం, బడిగుంట గ్రామాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్‌ టవర్ల ఏర్పాటుకు అటవీ అనుమతులు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సర్పంచి విజయభాస్కరరెడ్డి, పీఓడబ్ల్యూ నాయకురాలు శ్రీదేవి తదితరులు వినతిపత్రాన్ని అందజేశారు. మారేడుమిల్లి మండలం వైదపూడిలో శిథిలావస్థలో ఉన్న పాత పాఠశాల భవనం స్థానే కొత్త భవనం మంజూరు చేయాలని, సీసీ రోడ్లు వేయాలని కోరారు. తొయ్యేరు ముంపు గ్రామంలో 18 సంవత్సరాలునిండిన బాధితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ద్వారా ఇంటి స్థలాలు ఇవ్వాలని లింగంపల్లి బేబి, రమణ, సీతమ్మ తదితరులు విన్నవించుకున్నారు. జాతీయ రహదారి-516ఈ నిర్మాణంలో భూములు నష్టపోయిన తమకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని గంగవరం గ్రామానికి చెందిన వెంకటరమణ తదితరులు అర్జీ పెట్టుకున్నారు. ఏడీఎంహెచ్‌ఓ జి.శిరీష, వెటర్నరీ డీడీ షరీఫ్, గిరిజన సహకార సంస్థ డీఎం పార్వతీశ్వరరావు, పీహెచ్‌ఓ చిట్టిబాబు, ఏజెన్సీ డీఈఓ మల్లేశ్వరరావు, గిరిజన సంక్షేమశాఖ ఈఈ డేవిడ్‌రాజు, విద్యుత్తు శాఖ ఈఈ యూసఫ్, డీఎల్‌పీఓ రాఘవన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని